
– రావణసురిడి లాంటి కౌశిక్ రెడ్డిని రాముడి పేరు పెట్టుకున్న కేటిఆర్ ప్రోత్సహిస్తున్నారా?..
– ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కౌశిక్ రెడ్డి.
– ఇప్పటికే పెద్ద మొత్తంలో సదరు వ్యాపారి దగ్గర మొదటి విడత డబ్బులు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదు.
– హుజురాబాద్ లో పెరిగిన కౌశిక్ రెడ్డి అరాచకాలు.
– వ్యాపారి డబ్బులు విషయంలో కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సభ్య సమాజంలో ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలి కానీ పదవిని అడ్డుపెట్టుకొని వ్యాపారస్తులను, ఇతర వర్గాలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెల ప్రణవ్ అన్నారు. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమలాపూర్ మండలం వంగపల్లి-గుండేడ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారి కట్టా మనోజ్ రెడ్డి దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశాడని సాక్షాత్తు వాళ్ళ భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం, అదీకూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతినిధిపై మహిళ దరఖాస్తు ఇవ్వడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, కౌశిక్ రెడ్డి చర్యల వల్ల ఇప్పటికే హుజురాబాద్ పరువు దిగజారుతుందని, ఇలాంటి చర్యల ద్వారా మరింత దిగజార్చుతున్నాడని ఆయన ఆరోపించారు. గతంలో కూడా అనేకమందిని బెదిరించి ఇబ్బందులకు గురిచేసాడని ఇలాంటి ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించుకున్నామని హుజురాబాద్ ప్రజలు అంతర్మదనంలో పడ్డారని అన్నారు. హైదరాబాద్ లో నీతి మాటలు చెప్పే కేటిఆర్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై మీ వైఖరేంటో తెలియజేయాలని, ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిపితే కౌశిక్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదని అన్నారు. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు వస్తాయని కేటిఆర్ పదే, పదే చెప్పడం కాదనీ కౌశిక్ రెడ్డి రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు మీరో, మేమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి అరాచకాలు ఇంకెన్ని బయటపడతాయో అని ప్రజలు చర్చింటుకుంటున్నారని, కౌశిక్ రెడ్డి భాదితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్సీగా హుజురాబాద్ కు ఏం నిధులు తీసుకొచ్చావని అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదని, ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి పనులు చేశారో అందరికీ తెలిసిందే అని, ఎమ్మెల్సీగా, ఎమ్మేల్యేగా కౌశిక్ రెడ్డి విఫలమయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, కమలాపూర్ మార్కేట్ చైర్మెన్ ఝాన్సీ-రవీందర్, హుజురాబాద్ మార్కెట్ చైర్మెన్ జి రాజేశ్వరి-స్వామిరెడ్డి, హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు మేకల తిరుపతి, కిరణ్, హనుమాన్ దేవాలయ చైర్మెన్ కే శంకర్, హుజురాబాద్ మండల, పట్టణ మహిళా అధ్యక్షురాలు వై పుష్పలత, రాధ, నాగమణి, వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉగ్రదాడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి..
జమ్మూ కాశ్మీర్ లోని పాహెల్గాం ఉగ్రదాడిలో మరణించిన 26 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్. దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, పార్టీలకతీతంగా ఒక్కటిగా పోరాడి ఉగ్రవాద సంస్థల నివారణకు కృషి చేయాలని కోరారు. ఉగ్రదాడుల విషయంలో కేంద్రం కఠినంగా ఉండాలని, ఇలాంటివి జరగకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.




మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్