
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజానికి నష్టం కలిగించే మాదకద్రవ్యాల వినియోగం, నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జీ అన్నారు. మంగళవారం హుజురాబాద్ శివారులోని కేసి క్యాంపులో గల ఏసిపి కార్యాలయంలో ఏడిసిఎస్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు యాంటీ డ్రగ్ కంట్రోల్ సభ్యులకు సమన్వయం ఉండడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగిన నష్టం పై విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాలు, సోషల్ మీడియాలో గోడచిత్రాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు సాంకేతికత వినియోగం, పెరిగిన గస్తీలు, కమ్యూనిటీ వాచ్ ప్రోగ్రామ్లు వంటి వ్యూహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్లూ కోల్ట్ బృందాలు విద్యాసంస్థలను నియమితంగా సందర్శించి ప్రాముఖ్యత కలిగిన పోలీసింగ్ నిర్వహిస్తాయని, ఏడిసి సభ్యులకు ప్రస్తుత మాదక దవ్యాల రకాలపై, వాటి మూలాలు పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్డిపిఎస్ చట్టంలోని సంబంధిత విభాగాలు, శిక్షల గురించి విద్యార్థులకు, ఇతర సమాజ సభ్యులకు తెలిసి ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాల సమస్యను సమగ్రంగా ఎదుర్కొనడం కోసం ఆరోగ్య, విద్య, సామాజిక సంక్షేమ శాఖల మధ్య అంతర శాఖల సమన్వయం అవసరమని అన్నారు. సమాజంలో మాదకద్రవ్య వాడకానికి కారణమవుతున్న సామాజిక ఆర్థిక అంశాలపై గుర్తించాలన్నారు. దీర్ఘకాలిక పరిష్కారాల కింద విద్య, ఉద్యోగావకాశాలు, సామాజిక మద్దతు వ్యవస్థలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ సుమీక్షా సమావేశంలో హుజురాబాద్ టౌన్ సిఐ జి. తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ, పోలీసులు, సభ్యులు పాల్గొన్నారు.


