
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామ ప్రజలు, నాయకులు, అన్ని కులాల పెద్దలు పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి, తమ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ దేవాలయాల అభివృద్ధికి సాయంగా కోరిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధి పట్ల తన అనురాగాన్ని చాటుతూ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి, గ్రామస్థుల సమక్షంలో చెక్కును అందజేశారు.
“ప్రజల అభివృద్ధే నాకు ప్రథమ ప్రాముఖ్యత. ఇది నా బాధ్యత మాత్రమే కాదు – బాధ్యతను నెరవేర్చే పరిపక్వతకు నిదర్శనం” అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు, పెద్దలు ఆయనను ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేయూతతో గ్రామ అభివృద్ధి వేగం పడుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.





