
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:తిమ్మాపూర్ మండలం అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన వకులభరణం శ్రీధర్ భారత సైన్యంలో 26 సంవత్సరాల పాటు సేవలందించి, ఇటీవల పదవీ విరమణ చేసి స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశేషంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టపాసులతో ఆహ్వానం పలికిన కాలనీవాసులు, శ్రీధర్ దంపతులకు పుష్పగుచ్చాలతో స్వాగతం చెప్పారు. అనంతరం కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ..దేశానికి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్న, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఈశాన రాష్ట్రాలలో నాయక్, సుబేదార్ హోదాల్లో పనిచేశాను. దేశ రక్షణలో భాగమవ్వడం గర్వకారణం అని తెలిపారు. పదవీ విరమణ చేసినా, అవసరమైతే దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, శ్రీధర్ కుటుంబ సభ్యులు పాల్గొని, తన స్నేహితులు వేడుకలను మరింత చక్కగా తీర్చిదిద్దారు.







