
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులో రైతులకు నీటి అవసరాలు తీర్చే చిలక వాగును కొంత మంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి చిలకవాగు ను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల, రైతుల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే చిలుక వాగును కొంత మంది వ్యక్తులు తమ స్వార్థం కోసం వాగు ప్రాంతాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్న అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిలక వాగు పరిసర ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయని, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు పలువురు చేశారు. పత్రికల్లో సైతం ఈ వార్త ప్రచురితం అయ్యింది. వెంటనే రెవిన్యూ, సర్వేయర్ అధికారులు వచ్చి సర్వే చేసి ఒకవైపు హద్దులు నిర్ణయించారు. కాగా అధికారులు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత తిరిగి గుర్తు తెలియని వ్యక్తులు చిలుక వాగు పరిసర ప్రాంతాల్లో మట్టిని పోసి వాగు స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ఆరోపిస్తున్నారు.
సమగ్ర విచారణ జరిపించండి…..
చిలక వాగు హద్దులను నిర్ణయించి, వాగు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు రెవిన్యూ, ఇరిగేషన్, సర్వేయర్ అధికారులు సమన్వయంగా విచారణ జరిపి ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకొని వాగులు కాపాడాలని సమ్మయ్య కోరారు.


చిలక వాగు లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణం

అక్రమ నిర్మాణం ఆపాలని నోటీసు జారీ చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శి..

అక్రమ నిర్మాణం పరిచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కొలిపాక సమ్మయ్య