
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గౌతమ బుద్ధుని 2569వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సందేల వెంకన్న ఆధ్వర్యంలో చలో బుద్ధగయ మరియు వడకాపూర్ దూళికట్ట లో నిర్వహించు బుద్ధుని జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మహాత్మ జ్యోతిబాపూలే గౌరవాధ్యక్షులు మరియు కామెర లక్ష్మణ్ బోధి మాట్లాడుతూ ఈనెల 12న వాడుకాపూర్ ధూళికట్ట మరియు ఈనెల 20న బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో నిర్వహించు బుద్ధుని జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. గౌతమ బుద్ధుడు మానవులు నీతితో మెలగాలని, నిజాయితీతో జీవించాలని, అహింసా మార్గాన్ని పాటిస్తూ దుఃఖ రహిత సమాజాన్ని నిర్మించడమే తన అంతిమ లక్ష్యం అని, తన జీవితాన్ని ధారబోసిన ప్రపంచ జ్ఞాని మేధావి శాంతికాముకుడు గౌతమ బుద్ధుడని పేర్కొన్నారు. ఆనాటి చక్రవర్తి అయినటువంటి అశోకుడు గౌతమ బుద్ధుని ఆలోచన విధానాన్ని బలంగా నమ్మి తన భార్య ద్వారా బుద్ధిజాన్ని స్వీకరించిన అశోకుడు ఆనాటి నుండి రాజ్యము రక్తపాతం కాకుండా అహింసా విధమైనటువంటి పద్ధతిలో నడిపించడానికి మూల కారణము బుద్ధిజమే అని తెలిపారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా బుద్ధిజంలో ఉన్నటువంటి మానవ విలువలు నిజమైన విలువలని నమ్మి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మహానుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో నాగెల్లి చంద్రారెడ్డి, సొల్లు బాబు, ఇల్లందుల సమ్మయ్య, కట్కూరి రాజేందర్, రామ్ రాజేశ్వర్, కుక్కమూడి రాజేష్, తునికి సమ్మయ్య, బొడిగె మల్లయ్య, చొక్కాం మల్లికార్జున్, ఆకునూరి అచ్యుత్, సిరికొండ సమ్మయ్య, ఏనూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

