
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియన్ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అత్యంత ప్రతిభ కనబరిచిన హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీకి చెందిన రాచపల్లి ప్రదీప్ నీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రదీప్ దేవంపల్లి గురుకుల కళాశాలలో చదువుతున్నడు. ఆల్ ఇండియన్ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి 92% మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచాడు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు చేతుల మీదుగా ప్రదీప్ సత్కరించబడ్డాడు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరి స్వామిరెడ్డి, హనుమాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు చల్లూరి విష్ణువర్ధన్, ముక్క రవితేజ తదితరులు పాల్గొన్నారు.

ప్రదీప్ ను సన్మానిస్తున్న ప్రణవ్ బాబు..