
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: రజతోత్సవ సభలో దళితున్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనీ అంబేద్కర్ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు అంబాల ఆనంద్ డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు అంబాల ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు అన్నారు. ఇప్పటికైనా దళితులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రజతోత్సవ సభలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇవ్వాలన్నారు. సభ వేదికకు ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ కు చౌరస్తాలో ఉన్న మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గౌరవ సూచకంగా పూలమాలవేసి సభ వేదికకు చేరుకోవాలన్నారు. అదేవిధంగా దళితుని ఇంట్లో భోజనం చేసి దళితుల పట్ల వారికి ఉన్న ప్రేమను తెలియజేయగలరని ఈ సందర్భంగా సూచించారు.

అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు అంబాల ఆనంద్