
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ శుక్రవారం రాత్రి హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదుల చర్యలను నిరసించారు ఉగ్రవాదులను ఏరి వేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఉగ్రవాదుల చర్యలను ఖండించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్, కోశాధికారి డాక్టర్ తొగరు విద్యాసాగర్, కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్, డాక్టర్ ఏం కృష్ణమూర్తి, డాక్టర్ నాగలింగం, డాక్టర్ పీ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎన్ రమేష్, డాక్టర్ బండి శృతి, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు.



కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న వైద్యులు