
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్- మున్సిపల్ పరిధిలోని దమ్మక్కపేటలో గురువారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గొర్రెల దొంగతనానికి యత్నించారు. దీనిని గమనించిన గొర్రెల కాపరులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఒకరు పారిపోగా మరొకరు పట్టుపడ్డాడు. పోలీసులకు అప్పచెప్పగా పట్టుబడ్డ దొంగ పెద్ద పాపయ్య పల్లెకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు ఇక్కడికి వచ్చి పొలాల్లో గొర్రెల మందలు పెడుతుంటారు- గతంలో ఇలాగే మందల నుంచి పలుమార్లు దొంగలు దోపిడికి పాల్పడి దాదాపుగా 40 గొర్రెలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు కాగా- గొర్రెల కాపరి బీరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
