
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధి వ్యాప్తికి కారణమైన వాటిపట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలని బస్తీ దవఖాన వైద్యాధికారి డాక్టర్ జరీనా అన్నారు. దోమ కాటుకు దూరంగా ఉండాలని దోమలు బుద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చెల్పూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో శుక్రవారం మలేరియా దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, సత్యం సిబ్బంది పాల్గొన్నారు.


