
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే 02ః హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బత్తుల మానస ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవగా శుక్రవారం పద్మశాలి సంఘం ఆద్వర్యంలో పూల బొకే ఇచ్చి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో 120 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూలో పాల్గొనగా, మానస 13వ స్థానంలో నిలవడం పట్లా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. మానస ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదలకు న్యాయాన్ని మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, బీసీ నాయకులు ఇప్పకాయల సాగర్, కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, వడ్డేపల్లి యాదగిరి, వెంకట్, వేముల శ్రీహరి, ఇప్పలపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.


ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మానసను సన్మానిస్తున్న పద్మశాలి సంఘం నాయకులు..