
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్ జూన్ 06: హుజురాబాద్ పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో “ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం_2025” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపూ సమ్మయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొరగాల తిరుమల మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల మనుగడ కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు, మధ్యాహ్న భోజనం, రెండు జతల స్కూల్ యూనిఫామ్స్, నూతనంగా పాఠశాలలో ఆరో తరగతి చేరే విద్యార్థులకు ఒక జత షూ, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అన్నీ ఉచితంగా విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల వసతులు మరుగుదొడ్లు, ప్యూరిఫై డ్రింకింగ్ వాటర్, భోజనం తినడానికి డైనింగ్ హాల్, విద్యార్థులు విద్యతో పాటు విద్యా సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పాఠశాల గ్రంధాలయం, విద్యార్థులు శారీరక శ్రమ చేయడానికి ఆటలు, విద్యార్థుల మానసిక ఉల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యతోపాటు విజ్ఞానం పెంచుకోవడానికి సైన్స్ఎగ్జిబిషన్, విహారయాత్రలు, అలాగే ఫీల్డ్ ట్రిప్స్ మొదలగు సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కల్పిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి పైన చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధతో పాటు, వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని వారికి ప్రత్యేకమైన శిక్షణతో పాటు విద్యా బోధనలు అందించడం జరుగుతుందనీ, విద్యార్థులు విద్యా పట్ల అనేకమైన మానసిక ఒత్తిడీలకు గురికాకుండా వారికి ప్రముఖుల చేత మోటివేషన్ తరగతులు, అలాగే మెడిటేషన్, యోగా తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కెంసారపూ సమ్మయ్య మాట్లాడుతూ…. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, అలాగే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గా కొనసాగుతున్నానని తెలిపారు. పాఠశాలలోనీ డైనింగ్ హాల్ కు గ్రిల్స్ తో పాటుగా వైట్ వాష్ పెయింటింగ్ తన సొంత ఖర్చులతో వేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కల్లేపల్లి రమాదేవి, ఉజ్మా నూరిన్ ఇమ్రాన్, రీటైర్డ్ హెడ్మాస్టర్లు వేల్పుల రత్నం, గుంటి రాజయ్య, రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సాదుల రవీందర్ బాబు, పాత్రికేయుడు కేసరి మధుకర్ రావు, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, బండ కిషన్. పాఠశాల ఉపాధ్యాయ బృందం పలకల ఈశ్వర్ రెడ్డి, ఆసియా, రోజారాణి, మాధవిలత, మారుతి ప్రసాద్, ఇమ్మడి సంపత్ కుమార్, శ్రీనివాస్, శ్రావణి, రాములు, శోభారాణి, సీఆర్పీలు రంగు దామోదర్, అమరేందర్ గౌడ్, మున్సిపల్ కార్యాలయ మేనేజర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ర్యాలీ నిర్వహించారు.



ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్
స్కూల్ హెడ్మాస్టర్ కుమారి శనగరం మేఘన బండ అంకుష్ వాడలో, డిపో క్రాస్ స్థానిక గుడిసెలలో పిల్లలను వారి తల్లిదండ్రులను కలిసిన టీచర్ మేఘన వారిలో అవగాహన కల్పించి గవర్నమెంట్ స్కూల్లో ఉచిత భోజనం గుడ్లు పాలు రాగి జావా ఉచిత బట్టలు బూట్లు పుస్తకాలు బుక్స్ నాణ్యత మైన విద్య
ఇంగ్లీష్ బోధన తదితర విషయాలపై అవగాహన కల్పించారు. గ్యారంటీగా పిల్లలకు విద్యను అందిస్తామని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు
వేల్పుల ప్రభాకర్, తల్లి తండ్రులు, పిల్లలతో మాట్లాడుతూ
కార్పొరేట్ విద్య ప్రైవేట్ స్కూలు అవగాహన లేని టీచర్లు ఇలాంటి విద్యపై మోసపోకండి వారి మాటలు నమ్మకండి, లక్షలు పెట్టి విద్యను కొనకండి దాని ద్వారా పిల్లలు చెడిపోతున్నారనీ
తల్లిదండ్రులకు దూరమైతున్నారనీ దయచేసి తల్లిదండ్రులారా!
ఆలోచించండి! మీ పిల్లలు బాగుపడాలంటే మీ పిల్లలకు మంచి విద్య అందించాలంటే ప్రభుత్వ స్కూల్లో శరణం అని అన్నారు.
ప్రభుత్వ స్కూల్లో గోల్డ్ మెడల్స్ అందుకున్న స్కూల్ టీచర్లు ఉన్నారనీ, దయచేసి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని
నాణ్యమైన విద్య కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్యను అందించే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి అని
పిలుపు నిచ్చారు.


హుజురాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్
స్కూల్ హెడ్మాస్టర్ కుమారి శనగరం మేఘన బడిబాటలో భాగంగా ఇల్లు ఇల్లు తిరుగుతూ ఆరాతీస్తున్న దృశ్యం.