
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం ఈరోజు ఇల్లందకుంట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబురాలలో భాగంగా నాయకుల చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా పథకంతో రైతులకి నేరుగా వారి అకౌంట్లో 12 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ పథకం 16వ తేదీన నిధుల విడుదల ప్రారంభించాం.. ఈరోజుకి 100 శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇల్లంతకుంట మండలానికి సంబంధించిమా 10670 మంది రైతులకు గాను 11 కోట్ల 42 లక్షల 17 వేల 328 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందni చెప్పారు. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు గారడి ప్రభుత్వం కాదు పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మాత్రమే సాధ్యం అయింది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు, ఎక్కేటి సంజీవరెడ్డి, గూడెపు ఓదెలు, పెద్ది శివకుమార్, ధర్మకర్తలు గుడిశాల పరమేశ్వర్, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎడ్ల కిషన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మీసా రాజయ్య, మర్రి వీరారెడ్డి, గోరుకుంట్ల స్వామి, మిట్ట మోహన్ రావు, మూడెడ్ల రమేష్, బండి మల్లయ్య, మేకల సురేష్, అరె రమేష్ రెడ్డి, సారంగం, గుత్తికొండ రవికుమార్, భోగం రాజేందర్, పెద్ది అభిలాష్, మారేపల్లి వంశీ, భోగం పృథ్వీరాజ్, రావుల రాజబాబు, తాడెం దిలీప్, జిల్లాల జలంధర్ రెడ్డి, దంసాని తిరుపతి, ధార లక్ష్మణ్, ఉప్పులాయిలారెడ్డి, కంకణాల ముకుంద రెడ్డి, శనిగరపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతలకు, మంత్రులకు పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..

పటాకాలు కాల్చి సంబరాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు..


మాట్లాడుతున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్..