
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 24: బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు హుజురాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ పాల్గొనగా అలాగే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ… జక్కని సంజయ్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనునిత్యం బీసీల హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు అని అభివర్ణించాడు. బీసీల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీల కులగణన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు చివరి అంచుల వరకు వెళ్లి కుల గణన సాధించిన వీరుడని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు కోసం మేమెంతో మాకు అంత సాధించాలనే అనే ఉద్దేశంతో బీసీలను చైతన్య పరుచుతూ, గ్రామ గ్రామాన చైతన్యపరచాలని కొండ లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలమైన వంకాడి నుండి అలంపూర్ వరకు రథయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42%శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జనుకల లక్ష్మణరావు పటేల్, హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, నాయకులు బుచ్చన్న, దిల్ శీనన్న, ఇప్పెనపల్లి నరేష్, గాలి సమ్మన్న, రవి తదితరులు పాల్గొన్నారు.



హుజురాబాద్ పట్టణంలో జక్కని సంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు…