
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారనీ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ పేర్కొన్నారు. ఈరోజు హుజురాబాద్ పట్టణంలోనీ ప్రతాప్ సాయి గార్డెన్స్ లో కరీంనగర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమెవేశం జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్ అధ్యక్షతన జరిగింది. CITU జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల మీద కక్షపూరితంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు పూర్తిగా లేకుండాపోవడం జరుగుతున్నదన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులకు గ్యారెంటీ లేకుండా చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ లో ఉన్నాయన్నారు. కార్మికుల యొక్క ప్రాథమిక హక్కులైన యూనియన్ రిజిస్ట్రేషన్, బేరసారాల హక్కు, సమ్మె హక్కు, కార్మిక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసే హక్కు, పనిగంటలు, కనీస వేతనము, పని భద్రత, సామాజిక భద్రత అంశాలు లేకుండా ఈ లేబర్ కోడ్స్ లో ఉన్నాయన్నారు. ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు, యాజమాన్యాలకు భావన నిర్మాణ కార్మికులకి సెస్ నిధులు జమచేయకుండా ఈ లేబర్ కోడ్స్ రూపొందించారన్నారు. కార్మికుల మీద కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వము వ్యవహరిస్తుంది కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు అన్ని భవన నిర్మాణ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ప్రతి అడ్డా మీద సమ్మె యొక్క చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ యొక్క వైఖరిని వివరించి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అమావాస్య మీటింగ్స్ జనరల్ బాడీ సమావేశాలు జరిపి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జంబుకం వెంకన్న, పళ్ళ తిరుపతి, రావుల ఎల్లయ్య, రేణుకుంట సారయ్య, Ch కొంరయ్య, రాజకుమారి, సర్దన స్వామి, ఉజ్జగిరి సుధాకర్, కాల్వ సమ్మయ్య, దేశబోయిన శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.


జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు..