
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: పోలీసుల పని తీరు మరింత సమర్థవంతంగా ఉండేలా టెక్నాలజీ వినియోగం పెరుగుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో సోలార్ సిస్టం ద్వారా పనిచేసే సీసీ కెమెరాలు హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ అదుపులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోలీసు స్టేషన్లలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అభినందనీయం. విద్యుత్ కోతలైనా పని ఆగకుండా, నిరంతరం పర్యవేక్షణ కోసం సోలార్ సిస్టం ద్వారా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మంచిదని అన్నారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాదవి, సీఐ సుధగోని రామకృష్ణగౌడ్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


సీసీ కెమెరాలు ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సిపి గౌస్ ఆలం..