
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
యువతలో మత్తుపదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆదేశాల మేరకు హుజూరాబాద్ పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హుజురాబాద్ గర్ల్స్ హైస్కూల్, చెల్పూర్ హైస్కూల్లలో విద్యార్థుల మధ్య డ్రగ్స్ తో అనర్థాలు, అనారోగ్యాలపై వ్యాస రచన పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీల్లో హుజురాబాద్ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్‌కి చెందిన ఎల్ లక్ష్మీ ప్రసన్న ప్రథమ బహుమతిని గెలుచుకోగా, చెల్పూర్ హైస్కూల్‌కు చెందిన రాంపూర్ గ్రామానికి చెందిన గట్టు హరిణి ద్వితీయ బహుమతిని, అదే స్కూల్‌కు చెందిన ఏదులాపురం శృతి తృతీయ బహుమతిని సాధించింది. గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ కే కరుణాకర్ విజేతలను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఏకాగ్రత, కృషి, పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదగాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సీఐ సూచించారు.




ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థినిలను అభినందిస్తున్న హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్