
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో గల కాకతీయ కాలనీలో శుక్రవారం మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డి మొక్కలను, చెత్తా చెదారమును తొలగించారు. వర్షాల వలన వరదనీరు మురికి కాలువల నుండి రోడ్ల పైకి చేరకుండా, మురికి కాలువలలో పేరుకుపోయిన సిల్టును మట్టిని కూడా తొలగించారు. అనంతరం మాంటిస్సోరి స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు తడిపొడి చెత్తలను వేరు చేసి పురపాలక సంఘ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని వారివారి తల్లిదండ్రులకు తెలుపుటకు, తడిపొడి చెత్తను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు గీత షాజు, షాజూ థామస్, బల్దియా మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, సీనియర్ సహాయకులు జె శ్రీకాంత్, జూనియర్ సహాయకులు రాజయ్య, ఇంచార్జ్ హెల్త్ సూపర్వైజర్ రోంటాల సుధీర్, ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, టి కుమారస్వామి, పి అనిల్ కుమార్ పాల్గొన్నారు.






విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం చేస్తున్న కమిషనర్ సమ్మయ్య..