
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే డెంగ్యూ మలేరియా వ్యాధుల పట్ల ప్రజలకు కనీస అవగాహన అవసరమని హుజురాబాద్ డిప్యూటీ డిఎం,హెచ్ ఓ డాక్టర్ బి చందు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండలం చెల్పూరులో ‘ డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా చెల్పూర్ పిహెచ్‌సిని ఆయన సందర్శించారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి వారికి వ్యాధుల వ్యాప్తి గురించి వివరించారు. పలు గృహాలను సందర్శించి నిర్లక్ష్యంగా ఇంటి ఆవరణలో వదిలేసిన టైర్లను, కొబ్బరి చిప్పలను వాటిలో నిలువ ఉన్న నీటిని మరియు పెరుగుతున్న దోమల లార్వాలను గృహాలకు సంబంధించిన యజమానులకు చూపించి అటువంటి నీటిని పార వేయించి కొబ్బరి చిప్పలను టైర్లను తీసి పారవేశారు. నీరు నిల్వ ఉండడం వల్ల వచ్చే వ్యాధుల గురించి వాటి వలన నష్టాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి ప్రజలకు వివరిస్తున్న ఉపవైద్యాధికారి డాక్టర్ చందు..