
Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నేటి యువత ప్రతినిధిర్థాలకు వ్యసనాలకు దూరంగా ఉండాలని మత్తుకు బానిసైతే ఆరోగ్యంతో పాటు జీవితం కూడా నాశనం అవుతుందని డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. కూరపాటి హాస్పిటల్, హుజురాబాద్, జమ్మికుంట ఐఎంఏ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్తుపదార్ధాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు యువత బానిస కారాదని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలవాడకాన్ని వ్యతిరేకంగా మనం అందరం ఒకవైపు నిలబడాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సురేష్, కూరపాటి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


