
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ పాఠశాలలో మంగళవారం డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియో తెరపి వైద్యుడు శ్రీకాంత్ ను విద్యార్ధులు సన్మానించారు. ఉపాధ్యాయులు వైద్యుల యొక్క గొప్పతనాన్ని విద్యార్ధులకు వివరించారు. ఫిజియో థెరపి వైద్యుడు శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ల విధులు, నిర్వహణ, చికిత్స విధానాలు, వివిధ రోగ నిర్ధారణకు ఉపయోగించే పరికరాల గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వేణు మాధవ్, ప్రిన్సిపాల్ సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

