
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 3: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల వసతి గృహం సువర్ణావకాశాన్ని కల్పిస్తోందనీ వసతి గృహం సంక్షేమ అధికారి కొలిపాక సుమన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల వసతి గృహలో మొత్తం 200 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ వసతి గృహంలో ప్రస్తుతం కేవలం 30 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. ఇంకా 170 సీట్లు అందుబాటులో ఉన్నాయని వసతి గృహం సంక్షేమ అధికారి కొలిపాక సుమన్ తెలిపారు.
ఈ ఖాళీలలో ఎస్సీ విద్యార్థులకు 138 సీట్లు, ఎస్టీ విద్యార్థులకు 9 సీట్లు, బీసీ విద్యార్థులకు 20 సీట్లు, ఓసీ విద్యార్థులకు 3 సీట్లు కేటాయించబడ్డాయన్నారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన వసతి సౌకర్యాలతో కూడిన విద్యను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలు
ఈ వసతి గృహం విద్యార్థులకు కల్పించడం జరిగిందన్నారు. ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారి చదువుకు, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడే అనేక సౌకర్యాలను అందిస్తోందనీ తెలిపారు.
హాస్టల్లో గీజర్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో పాటు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేడి నీటిని పొందవచ్చునని, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారానికి ఆరు కోడిగుడ్లు, ఆరు అరటిపండ్లను అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు వారానికి రెండుసార్లు చికెన్, నెలకు రెండుసార్లు మటన్ అందిస్తున్నామన్నారు. ఆధునిక విద్యకు అవసరమైన కంప్యూటర్ సౌకర్యం వసతి గృహంలో ఏర్పాటు చేయబ
డిందనీ తెలిపారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులు, పరిశోధనలు, ఆన్లైన్ తరగతుల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చునన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా లైబ్రరీ పుస్తకాలు అందుబాటులో ఉంచబడ్డాయనీ అన్నారు. పరిశుభ్రమైన తాగునీటి కోసం మినరల్ వాటర్ సౌకర్యం కల్పించడం వీటన్నింటితో పాటు, విద్యార్థుల వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 500 పాకెట్ మనీని నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమచేసే సౌకర్యం ఉండటం విశేషం అన్నారు. ఇది విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, వారికి స్వాతంత్ర్యాన్ని కూడా అందిస్తుందనీ ఈ అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు తక్షణమే వసతి గృహం సంక్షేమ అధికారి కొలిపాక సుమన్‌ను 9603880421 నంబర్‌కు సంప్రదించి వివరాలు తెలుసుకోవచనీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక అని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుమన్ పేర్కొన్నారు.


———————+++++++———————-
*పత్రికా ప్రకటనలు (యాడ్స్)*
——————-++++—————————







