
– వెరీ గుడ్ రాజేందర్ రావు..
కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై మరింత దృష్టి సారించాలని పిసిసి అధ్యక్షుడి సూచన
పిసిసి అధ్యక్షుడు అభినందనలు.. – మరింత బలాన్ని ఇచ్చాయి..
– కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: వెరీ గుడ్ రాజేందర్ రావు.. కీప్ ఇట్ అప్ ..శుక్రవారం హైదరాబాదులో జరిగిన ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరైన బహిరంగ సభకు కరీంనగర్ నుంచి దాదాపు 300 వాహనాలతో భారీ ర్యాలీతో తరలివచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావును పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
కాంగ్రెస్ సభ పెద్ద ఎత్తున విజయవంతమైన నేపథ్యంలో శనివారం హైదరాబాదులో పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను వెలిచాల రాజేందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడికి రాజేందర్ రావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సభ విజయవంతం కావడంలో పకడ్బందీ గా వ్యవహరించినందుకు పీసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ రావును పిసిసి అధ్యక్షుడు ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ నుంచి 300 వాహనాల ద్వారా 1500 మంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నేతలతో తరలిరావడం రికార్డు అని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు. అదేవిధంగా రాజేందర్ రావు కరీంనగర్ నుంచి చేపట్టిన ర్యాలీ తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ ర్యాలీగా నిలిచిందనీ కితాబు ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం ప్రకడ్బందీగా వ్యవహరించి కార్యకర్తలను భారీగా సమీకరించారని, కరీంనగర్ నుంచి భారీగా తరలిరావడం సంతోషకరమని వెలిచాల రాజేందర్ రావుతో పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. పీసీసీ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సభను సక్సెస్ చేశారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఇదే రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఇప్పటినుంచే మరింత కష్టపడి పని చేయాలని రాజేందర్ రావు కు సూచించారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత పకడ్బందీగా వ్యవహరించాలని, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రావు ను ఆదేశించారు. కాంగ్రెస్ సభకు కరీంనగర్ నుంచి తన వెంట మూడు వందల వాహనాలతో భారీగా కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా తరలి రావడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తనను అభినందించడం మరింత బలాన్ని చేకూర్చిందని రాజేందర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను సమీకరించి సభ విజయవంతానికి తోడ్పాటు అందించారని మహేష్ కుమార్ గౌడ్ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి తనకు మరింత మనో ధైర్యాన్ని ఇచ్చారని రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుని బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడికి తెలిపానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు ప్రత్యేకంగా కృషి చేస్తానని రాజేందర్ రావు పేర్కొన్నారు.

వెలిచాల రాజేందర్ రావును ప్రత్యేకంగా అభినందిస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
—————-++++++++++——————
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
——————–+++++++++——————–
*వార్షికోత్సవ శుభాకాంక్షలు*






