
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు పెంచాలని అన్నారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి అవసరమైన మెటీరియల్ ను జిల్లా యంత్రాంగం నుండి సమకూరుస్తామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు తదుపరి ఉన్నత విద్యలో ఉచితంగా ప్రవేశాలు, అనేక అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి వెసులుబాట్లను తెలియజేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలు ఉన్నచోట్ల ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ అంశాన్ని అధికారులతో చర్చిస్తామని తెలిపారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ దరఖాస్తు మార్గదర్శకాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వి.గంగాధర్, ఓపెన్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు.ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి


పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ దరఖాస్తు మార్గదర్శకాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్..
———————-+++++++++++—————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)#
—————–++++++++—————–
*వార్షికోత్సవ శుభాకాంక్షలు*






