
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు 300 మందితో రిటైర్మెంట్స్ విశ్రాంతి ఉద్యోగుల సంఘంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మాకంటూ ఒక ఆఫీసు లేదు, రిటైర్మెంట్ అయిన వృద్ధులమైన మాకు సమస్యలు చర్చించుకోవడానికి దయతో మీ పరిధిలో మునిసిపాలిటీ సెంటర్లలో సంఘం ఆఫీస్ పెట్టుకోడానికి అవకాశం ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. అలాగే కలెక్టర్ తో మాట్లాడి మాకు ఆఫీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారనే హామీ ఇచ్చినందుకు ప్లానింగ్ ఆఫీసర్ కి, ఏఈ కి, కమిషన్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హుజురాబాద్ మునిసిపాలిటీని
క్లీన్ అండ్ గ్రీన్ 100 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకపోతున్న మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకి మరియు ఏఈ సాంబరాజుకి తెలంగాణ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఇదే తరహాలో హుజురాబాద్ మునిసిపాలిటీనీ స్టేట్‌లో నెంబర్ వన్ గా నిలుపుతారని ఆశిస్తున్నామన్నారు. కొందరు ఈ కార్యక్రమానికి మీరు చేసే అభివృద్ధికి అడ్డుపడుతున్న ధైర్యంగా ఎదుర్కొంటూ హుజురాబాద్ అభివృద్ధి ధ్యేయంగా స్వచ్ఛభారత్ దిశగా ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు గోస్కుల ముత్యంరాజు, బి కిషన్ రెడ్డి, మార్త రవీందర్, ఈ వెంకట రాంనర్సయ్య, వేల్పుల ప్రభాకర్, ఏం కొమురయ్య, పిఎస్ రెడ్డి, బత్తిని సంజీవ్, గంగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.


మునిసిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ 100 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకపోతున్న మున్సిపల్ కమిషనర్
కెంసారపు సమ్మయ్యకి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు సత్కరిస్తున్న దృశ్యం.
——————-++++++++++—————–
@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@
——————-+++++++++++—————-
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&
