
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపు వస్తున్న టాటా ఏసీ ని మండలంలోని సింగపూర్ వద్ద అర్ధరాత్రి లారీ డ్రైవర్ తాగిన మత్తులో వెనుక నుండి ఢీ కొట్టి లారీనీ బోల్తా పడేశాడు. దీంతో తృటిలో పలువురికి ప్రాణాపాయం తప్పింది. లారీ ప్రధాన రహదారి పక్కన పడిపోగా టాటా ఏసీ సమీప ఇండ్ల ప్రాంతాలకు తరలి వెళ్లి ఆగింది. రోడ్డు మార్గంలో వెళ్ళే వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





