
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో గల ఆర్యవైశ్య హిందూ స్మశాన వాటిక చుట్టూ ఫినిషింగ్ వైరు వేయించేందుకు రూ.5 లక్షల మున్సిపల్ నిధులు మంజూరూ కాగా ఈ రోజు ఆ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సకాలంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) సాంబరాజు, ఆర్య వైశ్య సంఘ నాయకులు గందె శ్రీనివాస్, హరిశంకర్, నార్ల రాజేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, కటకం సత్యనారాయణ, నూక శ్రీనివాస్, రేణికుంట్ల సురేష్, నార్ల శ్రీనివాస్, అయిత బిక్షపతి, అయిత సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరికాయ కొట్టి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..


కొబ్బరికాయలు కొట్టి అన్నను ప్రారంభించేందుకు కృషి చేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు నార్ల శ్రీనివాస్, గందే శ్రీనివాస్…

కమిషనర్ సమ్మయ్యతో చర్చిస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకుడు గందె శ్రీనివాస్..





