
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జీవో నెంబర్ 99 రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీలలో మూడవ గ్రూప్ గా ఉన్న 26 మాల మరియు ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముట్టడి మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు హుజురాబాద్ మాల మహానాడు నాయకులను అర్ధరాత్రి నుండి ఇళ్లకు వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. అరెస్టు అయిన వారిలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి జూపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నీరటి రమేష్ కుమార్, నాయకులు ముక్క రమేష్, తొగరు సంపత్, కోడం నర్సింగ్, జూపాక నర్సింగ్, ముక్క రఘుపతి, గద్దల జయరాజ్ తదితరులను అరెస్టు చేసి ఈ రోజు సాయంత్రం తర్వాత సొంత పూచికత్తుపై వారిని వదిలివేశారు.

మాల మహానాడు నాయకులను ముందస్తు అదుపులోకి తీసుకున్న పోలీసులు..





