
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల ఆవరణలో సోమవారం జిల్లా విద్యాశాఖ, అలీమ్ కో ల సంయుక్త ఆధ్వర్యంలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవoక, ఇల్లంతకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలంల్లోని దివ్యాంగుల పిల్లలకు నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ ఈ శిబిరంలో హుజురాబాద్ బస్తీ దవాఖాన డాక్టర్ జరీనా, జిల్లా సమగ్ర శిక్ష IE కోఆర్డినేటర్, ఆంజనేయులు, హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ లు పాల్గొని 6 మండలాలకు చెందిన 94 మంది దివ్యాంగులైన పిల్లలకు చికిత్సలు నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన కృత్రిమ పరికరాలను అందించే కార్యక్రమం త్వరలో జరుగుతుందని తెలియజేశారు. ఈ ఉచిత నిర్ధారణ శిబిరంలో సీఆర్పీలు గూండా రాజిరెడ్డి, రవిబాబు, 6 మండలాల ఐ ఆర్ పిలు, తదితరులు పాల్గొన్నారు.



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు…

చిన్నారుల పేర్లు నమోదు చేస్తున్న తల్లిదండ్రులు..

దివ్యాంగ చిన్నారులను తీసుకొని ఐదు మండలాల నుండి తరలివచ్చిన తల్లిదండ్రులు..





