Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం పప్పుల శారదను సోమవారం పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాలపల్లి పద్మశాలి గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్, బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, జడల సదాశివ, ముషం సత్యం, నగేష్, శ్రీనివాస్, అంజయ్య, సుధాకర్, మాజీ ఎంపిటిసి గద్దెల లలిత, ప్రాథమిక పాఠశాల చైర్మన్ మ్యాడద శ్రీలత, గుండేటి దేవయ్య, బింగి రాణి, ఎడ్ల రిషిత, కొడిగోటి రాణి, దేవోజు స్వరాజ్యం కేత, అనిత తదితరులు పాల్గొన్నారు.






