
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్ గళం విప్పిందని బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు విడపు అనురాగ్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్, అనుబంధ సంస్థల నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి విద్యార్థుల కోసం పోరాటం చేశాడని, గ్రూప్–1 పరీక్షలలో జరిగిన అన్యాయంపై అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడూ విద్యార్థుల పక్షాన బలమైన స్వరం వినిపించారనీ, అసెంబ్లీలోనూ, బయటా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, అభ్యర్థుల హక్కుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎప్పుడూ అండగా ఉన్నాడని అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడిన తీరు, ధైర్యం, ప్రతి యువకుడిలో నమ్మకాన్ని నింపిందనీ అన్నారు.
హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి పెద్ద చెంపపెట్టు అని బిఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి అసమర్థత మరోసారి రుజువైందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ విడపు అనురాగ్, ఎండి అంజదుల్లా ఖాన్, సంతోష్ గౌడ్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్, కేటీఆర్, కౌశిక్ రెడ్డిల చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్న బిఆర్ఎస్వి నాయకులు…





