
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలకోక్కుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు నర్సింగ్లోని ఓం కన్వెన్షన్లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితేల ప్రణవ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…ప్రతి ఏడాది కొత్తగా విడుదల అవుతున్న కెమెరాలు, నూతన సాంకేతిక పరికరాలు, ఏఐ టూల్స్ వాడకంపై అవగాహన కల్పించే వేదికగానే ఫోటో ఎక్స్పో నిలుస్తుందని, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాచర్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు భాషవేణి రాజేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ బింగి మురళీమోహన్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, ఎడ్ల కుమార్, ప్రధాన కార్యదర్శి దూలం చిరంజీవి, సంయుక్త కార్యదర్శులు బండి రమేష్, కన్నూరి రాజేష్, కోశాధికారి తాటిపల్లి మధుకర్, గౌరవ అధ్యక్షులు అయిత రాజేందర్, ఫోటోగ్రాఫర్లు డి.వెంకటయ్య, వేముల శ్రీనివాస్, మాడ రవీందర్ రెడ్డి, బిక్షపతి, రమేష్, నరేందర్, సృజన్, బిక్షపతి, శ్రీధర్, సంపత్, ఆదిత్య, శ్రీశైలం, పాషా తదితరులు పాల్గొన్నారు.



ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న ప్రణవ్..

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితేల ప్రణవ్ ను సత్కరిస్తున్న నాయకులు..





