
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తొలి భూ పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరనారి అన్నారు. నిజాం పాలనలో విస్నూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన తిరుగుబాటు ఆమెకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను అందించిందన్నారు. చాకలి ఐలమ్మ1895, సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రామపర్తి మండలం కిష్టాపూర్ గ్రామంలో జన్మించారనీ గుర్తు చేశారు. ఆమె 14 ఏళ్ల వయసులో జనగామ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నరసయ్యని వివాహం చేసుకున్నారనీ, ఐలమ్మ ఆర్థికంగా వెనుకబడిన చాకలి (బట్టలు ఉతికే) కుటుంబానికి చెందిన వారు అని చెప్పారు. భూ పోరాటంలో, తెలంగాణ ప్రాంతంలోని జమీందార్లైన విస్నూర్ దేశ్‌ముఖ్‌కి వ్యతిరేకంగా ఆమె చేసిన తిరుగుబాటులు ముఖ్య మైందన్నారు. ఆదాయ హక్కు, భూస్వాములు తమ భూమిలోని పంటను స్వాధీనం చేసుకునేవారన్నారు. అటువంటి సమయంలో, ఆంధ్ర మహాసభ సభ్యుల సహాయంతో, ఐలమ్మ తన పంటను కాపాడుకోవడం ద్వారా భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడిందనీ గుర్తు చేశారు. ఈ ధీరమైన చర్య అనేక మందికి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఐలమ్మ ప్రాముఖ్యత మహిళా ధైర్యం, ఐలమ్మ ధైర్యం సామాజిక ఆధునిక పరిణామాల్లో స్త్రీల శక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. తొలి భూ పోరాటం ఆమె చేసిన పోరాటంగా తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిందన్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించి, తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండలం రజక సంఘం అధ్యక్షులు సుంకరి రాజమౌళి, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, బిసి ఆజాద్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్ప కాయల సాగర్, హుజురాబాద్ మాజీ మార్కెట్ చైర్మను ఎడవెల్లి కొండల్ రెడ్డి, బిఆర్ఎస్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగెం సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు, చంద్రగిరి కుమార్, కూరపాటి రామచంద్రం, పంజాల వెంకట్ గౌడ్, సందెల వెంకన్న, శ్రీకాంత్, ఇప్పలపల్లి నరేష్, జే సదానందం, వెంకట్రాజం మాజీ ఎంపీపీ, వేల్పుల ప్రభాకర్, శ్రీనివాస్ పటేల్,
̊ నిమ్మటూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు…..


పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు..





