
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండల కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు అనుమతితో, కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అధ్యాపకురాలు సుగుణ ఆధ్వర్యంలో మిగతా అధ్యాపకురాళ్ళు సుహాసిని, రేణుకా, రజనీ, రజిత, శైలజ, జ్యోతి, రాజమణి, వనమాలతో పాటు విద్యార్థినులు తీరొక్క పూలు సేకరించి పేర్చి ,చక్కని రంగవల్లి వేసి బతుకమ్మ పాటలు పాడి విద్యార్థినులకు సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించారు. శనివారం నుండి కళాశాలకు బతుకమ్మ పండుగ సెలవులు ప్రకటించిన సందర్భంలో ముందస్తుగానే బతుకమ్మ సంబురాలు, ఆటపాటల మధ్య సంబరంగా చేసుకొని, అనంతరం తీపి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు మాట్లాడుతూ కులమతాలకతీతంగా ఆడుకునే తెలంగాణా ఆట బతుకమ్మ, కష్టసుఖాలను పాలుపంచుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్నేహభావాని చాటే పండుగే ఈ బతుకమ్మ అన్నారు. కళాశాల మహిళా అధ్యాపకులకు, విద్యార్థినిలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తులసీ దాసు, రాజశేఖర్, రమణ, విజేందర్ రెడ్డి, మురళీ మోహన్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


బతుకమ్మలతో కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయ రావు, అధ్యాపకులు, విద్యార్థులు..



అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటలాడుతున్న, అధ్యాపకులు, విద్యార్థులు, మహిళలు





