
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట), సెప్టెంబర్28: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి రఫీ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షిరాభిషేకం నిర్వహించారు. నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు రఫీ మాట్లాడుతూ…75 ఏళ్ళలో నూర్ భాషా దూదేకుల కులస్తుల అభివృద్ధి కోసం ఎన్ని ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారిన ఎవరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదని మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 30కోట్ల లోన్ బడ్జెట్ కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులకు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.. మైనార్టీ ముస్లింలలో నూర్ భాషా దూదేకుల కులంలో అభివృద్ధికి నోచుకోక బేకరీలలో, సైకిల్ షాపులలో, పరుపులు కుట్టు కుంటూ, బ్యాండ్ మేళం వాయించు కుంటు తమ జీవనం కొనసాగిస్తున్నారని అలాంటి తమ కుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి ఆర్థిక ఎదుగుదలకు కృషిచేసిన ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా నూర్ భాషా దూదేకుల కులస్తులకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి ఆర్థిక ఎదుగుదలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ పెద్ది కుమార్ హాజరై మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ని ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రికల్ స్కూటీలు వితంతువులకు ఒంటరి మహిళలకు లోన్ సౌకర్యాన్ని కల్పిస్తూ బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట కభారస్థాన్ అధ్యక్షుడు హుస్సేన్, నూర్ బాషా దూదేకుల కుల సంఘ రాష్ట్ర నాయకులు అన్వర్ బాబు, లాల్ మమ్మద్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు అఙ్గార్ పాషా, సిరిసేడు మైనార్టీ సెల్ అధ్యక్షుడు గపూర్, అక్బర్, అబ్బాస్, అలి, అబ్దుల్ గని, సర్దర్, కలిల్, హకీమ్ పాషా, మాంసబ్ తదితరులు పాల్గొన్నారు.



పాలాభిషేకం నిర్వహిస్తున్న నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి రఫీ..

మాట్లాడుతున్న నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి రఫీ, పక్కన పెద్ది కుమార్…





