
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై హుజురాబాద్ పట్టణంలో వివిధ బీసీ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే భిక్ష కాదనీ, ఇది బీసీల హక్కు అని, తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్ రక్షించుకోటమే కోసం ఈ నెల18న బిసి జేఏసీ ఇచ్చిన బందును విజయవంతం చేయాలని కోరారు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తూ ఓట్ల కోసమే తాయిలాలు ఇస్తున్నాయని అన్నారు. బీసీలు చైతన్యవంతులయ్యారని మా హక్కులు మేము కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చిలుకమారి, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, నాయకులు సందెల వెంకన్న, ఇప్పకాయల సాగర్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మార్త రవీందర్, నాగరాజు, భాస్కర్, శివమణి, మధుకర్, చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.







