
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోడ్లపై రైతులు వడ్లు ఎండబెట్టడం ప్రమాదకరమణి, ఎవరూ రోడ్డుపై ధాన్యం ఆర పెట్టవద్దు అని – మన గ్రామం – మన బాధ్యత! గా ప్రతి ఒక్కరు భావించాలని బిఎస్పీ హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గిన్నారపు మహేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వాల అసమర్థత వల్ల అటూ రైతన్నలకు, ఇటు ప్రజలకు రవాణా సౌకర్యాలు చాలా ఇబ్బందికరంగా మారాయన్నారు. పేరుకే ఐకెపి సెంటర్ లు కానీ ఎగుమతులు, దిగుమతులు అన్ని రోడ్ల మీదనే వడ్లు పొయ్యడం వలన ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు కోకొల్లలుగా జరగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన, నష్టపోయిన వారి కుటుంబాలు నడిరోడ్డున పడటం జరుగుతున్న ప్రభుత్వం చూస్తూ మౌనంగా ఉండటం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హుజురాబాద్ బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి గిన్నారపు మహేందర్ పేర్కొన్నారు. లేని యెడల ఈ ఘటనలకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వడ్ల కుప్పలతో ప్రమాదాలకు గురై బజారున పడిన వారి కుటుంబాల ఆత్మఘోష మీ కుటుంబ తరతరాలను శపిస్తుందని మరవద్దు అని మహేందర్ పేర్కొన్నారు.

హుజురాబాద్ బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి గిన్నారపు మహేందర్





