
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
విద్యార్థులు పట్టుదలతో శ్రమించి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకొని విజయం సాధించవచ్చని హుజురాబాద్ టౌను సీఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యలు పేర్కొన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోనీ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు పిల్లల కేరింతల మధ్య ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు, జి జెఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జీవితంలో రియల్ హీరోకు రీల్ హీరోకు తేడాను తెలుసుకోవాలని జీవితంలో ప్రతి వ్యక్తికి కష్టాలు వస్తాయని వాటికి కృంగిపోతే భవిష్యత్తు అంధకారమేనని అన్నారు. విద్యార్థులు ఏదైనా ధైర్యంతో ముందు అడుగు వేసినట్లయితే గమ్యాన్ని చేరవచ్చు అని అన్నారు. ప్రిన్సిపల్ వి ఆంజనేయరావు మాట్లాడుతూ…గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా పుస్తకాలు అందిస్తూ అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సుగుణ, రాజశేఖర్, విజేందర్ రెడ్డి, తులసీదాస్ మురళీమోహన్ వాసుదేవరావు వనమాల తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమంలో మాట్లాడుతున్న టౌన్ సిఐ కరుణాకర్..

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..



అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..

సమావేశలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ ఆంజనేయరావు..






