
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కోర్టు సముదాయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం బుధవారం న్యాయమూర్తులు పిబి కిరణ్ కుమార్, పద్మ సాయిశ్రీ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య, లు మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో పలు ప్రాంతాల్లో సుమారు 100 మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అంతేకాకుండా వాటిని పరిరక్షించాలని అప్పుడే పర్యావరణం బాగుంటుందన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం బారి నుంచి రక్షించుకోవడానికి, స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసమైనా ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు.




మొక్కలు నాటుతున్న న్యాయమూర్తులు పిబి కిరణ్ కుమార్, పద్మ సాయిశ్రీ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్యలు….
*కోర్టు ఆవరణలో మెగా హెల్త్ క్యాంపు*
కోర్టు ఆవరణలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, ఉద్యోగులకు డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ చందు ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు, చిల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మధుకర్, పల్లె వైద్యులు డాక్టర్ జరీనా, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ తులసి దాస్ లు న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు ఆరోగ్య సలహాలు సూచనలు అందించారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి వ్యాధి సోకకముందే జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, ఏజిపి గుర్రం శ్రీనివాస్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్..


మాట్లాడుతున్న డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ చందు





