
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ అసోసియేషన్ కు చెందిన సుమారు 30 మంది సీనియర్, జూనియర్ న్యాయవాదులు ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రమేష్ అధ్యక్షతన అత్యవసర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అందరు న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ న్యాయవాదుల సంక్షేమానికి విరుద్ధంగా, న్యాయవాదులను కించపరుస్తూ, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లను అవమానపరుస్తూ, అడ్వకేట్ల సంక్షేమానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ఒంటెద్దు పోకడలతో న్యాయవాదులకు అన్యాయం చేస్తున్నందున అందరూ న్యాయవాదులు ఏకపక్షంగా అతన్ని అరుణ్ కుమార్ ను అధ్యక్ష పదవి నుండి రీ కాల్ చేస్తూ అతన్ని పదవి నుండి తొలగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. అతని స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న నూతల శ్రీనివాసును కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ నూతల శ్రీనివాస్ కు మాజీ బార్ ప్రెసిడెంట్ అందే వెంకటేశ్వరరావు, బండి కళాధర్, జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ల రమేష్, మాజీ జనరల్ సెక్రెటరీ కడార్ల సాంబమూర్తి, ఏబూసి లింగారెడ్డి, కనకం తిరుపతి, ములుగు కొండయ్య, బత్తుల తిరుపతి, కన్నెబోయిన అశోక్, ములుగు సదయ్య, పొట్లపల్లి శ్రీధర్ బాబు తదితరులు అభినందనలు తెలిపారు. కాగా వీరు న్యాయమూర్తులను కలిసి ఈ ఏకగ్రీవ తీర్మాణ ప్రతులను, నూతన అధ్యక్షుడినీ ఎన్నుకున్న దాని గురించి వివరించినట్లు తెలిపారు.



నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన నూతల శ్రీనివాస్..





