
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్15: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయకాలనీలో ఓపెన్ ప్లాట్లు పారిశుద్ధ్య సమస్యలకు, ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారాయి. ఈ ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగండంతో పాటు మురికి నీరు, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ఆ ప్రాంతం దోమలకు ఆవాసంగా మారాయి.
ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా కాలనీవాసులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సీజనల్ వ్యాధులు వంటి జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు, చెత్తాచెదారం కారణంగా కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. అంతేగాక ఇలాంటి ప్లాట్లలో పెరిగిన పొదల కారణంగా పాములు, ఇతర విష సర్పాలు క్రిమి కీటకాలు బెడద కూడా పెరిగింది.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బల్దియా కమిషనర్ తీరుపై ఆగ్రహం!
ఈ సమస్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాలనీవాసులు ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు కమిషనర్‌కు పట్టవా? మానవుల ప్రాణాల కంటే కమిషనర్ కు కాళి స్థలాల వారితో మిత్రుత్వమే ముఖ్యమా? అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
తక్షణ చర్యలకు డిమాండ్..
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కాలనీవాసులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేసి, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలనీ, మురుగునీరు నిల్వ లేకుండా, డ్రైనేజీ వ్యవస్థను తాత్కాలికంగా మెరుగుపరచాలనీ,
దోమల నివారణకు కాలనీ అంతటా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలనీ కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.


కాకతీయ కాలనీలో ఓపెన్ ప్లాట్లలో పరిశుభ్రత లోపించి మురుగునీరు నిలచి, దోమలు వృద్ధి చెందిన దృశ్యంలు..





