
– హాజరైన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఎన్టీఆర్ వీరాభిమాని, టీడీపీ సీనియర్ నాయకుడు కళ్యాడపు ఆగయ్య అంత్యక్రియలు అభిమానులు, భారీ జన సందోహం అశృనయనాల మధ్య జరిగాయి. సోమవారం ఆగయ్య మృతిచెందగా మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. కాపువాడలోని ఆయన స్వగృహం నుంచి శివాలయం, హౌజింగ్ బోర్డు ద్వారా తీగలవంతెన వద్ద గల స్మశాన వాటిక వరకు అభిమానులు, టీడీపీ కార్యకర్తల భారీ ర్యాలీతో అంతిమయాత్ర కొనసాగింది. ఆగయ్య అంత్యక్రియల్లో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్ గౌడ్, పుట్ట నరేందర్, శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి మాజీ ఎంపిపి బోలమాల శంకర్ మానకొండూర్ జడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్ వివిధ పార్టీల నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మున్నూరు కాపు సామాజిక సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమానులు, ప్రజా సంఘాల తరపున కాపు వాడ బైపాస్, హౌసింగ్ బోర్డు ప్రథాన కూడలి లో ఆగయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు


పార్టీ కండువా కప్పి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రైతు సంఘం జాతీయ నాయకుడు పోలాడి రామారావు…

పూలమాలవేసి నమస్కరిస్తున్న జాతీయ నాయకుడు రామారావు..

ఆగయ్య కు అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం…





