
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మెకానికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. ఆదివారం
హుజురాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెకానిక్ భవిష్యత్ సన్నాహక సమావేశo జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో మెకానికులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు ఐడి కార్డులు, నియామక పత్రాలను అందజేసిన అనంతరం ప్రణవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెకానిక్ సంఘ నాయకులు గజ్జి సమ్మయ్య, తలకొక్కుల రమేష్, శ్రీనివాస్, రాజు, మహేందర్, సదానందం, కార్యవర్గం, నాయకులు పాల్గొన్నారు.






ప్రణవ్ కు స్వాగతం పలుకుతున్న మెకానిక్ సంఘ నాయకులు, దీపము వెలిగిస్తున్న ప్రణవ్, గుర్తింపు కార్డులను అందజేస్తున్న ప్రణవ్, కార్యక్రమంలో పాల్గొన్న మెకానికులు, సభ్యులు…





