Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న హుజురాబాద్ పట్టణం కరాటే విద్యార్థులు పెద్దపెల్లి లోని చందు ఫంక్షన్ హాల్ బిఎంఆర్ కరాటే డు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచినట్లు కరాటే మాస్టర్ ఎస్.కె జలీల్ తెలిపారు. 12 సంవత్సరాల విభాగం కటాస్ లోని సిహెచ్ సాయి చరణ్ గోల్డ్ మెడల్ మరియు స్పారింగ్ లో సిల్వర్ మెడల్, 12 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో ఎ. స్నిగ్ధ కటాస్ లో గోల్డ్ మెడల్, 11 సంవత్సరా అమ్మాయిల విభాగం ఆల్ కలర్ బెల్ట్ లో హుమేరా కటాస్ లో సిల్వర్ మెడల్, 11సంవత్సరాల జూనియర్ విభాగంలో పి కిరణ్ మయి కటాస్ లో సిల్వర్ మెడల్, వైట్ బెల్ట్ సీనియర్ 13 సంవత్సరాల భాగంలో పి సహస్ర కటాస్ లో గోల్డ్ మెడల్, 8 ఎనిమిది సంవత్సరాల విభాగంలో పీనిసి క టాస్ లో సిల్వర్ మెడల్, తొమ్మిది సంవత్సరాలు ఆరెంజ్ బెల్ట్ కేటగిరిలో ఎ శ్రియాన్ కటాస్ లో సిల్వర్ మెడల్, 8 సంవత్సరాల బ్లూ బెల్ట్ లో గౌసియా ఫాతిమా కటాస్ లో గోల్డ్ మెడల్, ఏడు సంవత్సరాల విభాగంలో ఆరెంజ్ బెల్ట్ లో ఎస్.కె ఖాజా మైనుద్దీన్ సిల్వర్ మెడల్, సిర్సపల్లి గొర్రె దేవేందర్ 11 సంవత్సరాలు విభాగంలో కటాస్ లో గోల్డ్ మెడల్ బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, మాజీ సర్పంచ్ కొండ గణేష్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి రాజ్ కుమార్, డైరెక్టర్ వి గోపాల్, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి ఖలీద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు గోస్కుల మధు గోస్కుల నాగమణి, మైనార్టీ నాయకులు ఎండి తౌసిఫ్ లు అభినందించారు.

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో కరాటే మాస్టర్ జలీల్, అతిథులు…





