
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ జన్మదిన వేడుకలు ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వెరోల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. గురుకుల విద్యాలయ సంస్థ చైర్మన్ గా, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రవీణ్ కుమార్ చేసిన సేవలు ఎనలేని వని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు ఎర్ర రాజు, మేకల రవీందర్, సందేల వెంకన్న, పరమేష్, వెంకటేశ్వర్లు, అంబాల రజినీకాంత్, చిలుకమారి శ్రీనివాస్, చల్లూరి రాజేందర్, గడిపే రవీందర్, మధుకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

వెంకి పల్లిలో…
జ్ఞాన యోధ సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ 58వ జన్మదిన పురస్కరించుకొని రాష్ట్ర కో కన్వీనర్ గడప రాజు స్వేరో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ వెంకీ పల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలలో తీసుకొచ్చిన విద్యా విప్లవం గురించి తెలియపరుస్తూ అగ్గిపెట్టె కొనాలంటే ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నుండి మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరం ఎక్కి అక్కడ జాతీయ జెండా అంబేద్కర్ బొమ్మ గురుకులాల ఘన చరిత్ర చాటి చెప్పిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్పి గురుకులాల సెక్రెటరీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి ఆర్మీ ఆఫీసర్లు యుద్ధ పైలట్లుగా రాణిస్తున్నారన్నారు. ఇప్పుడు అనేకమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, బిజినెస్ మాన్లుగా ఎదగడానికి ఆర్ఎస్పీ ఒక స్ఫూర్తి అన్నారు. ఇంకా ఫ్రీడమ్ స్కూల్ కోడింగ్ స్కూల్ ఎన్నో రకమైన విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన భావి భారత పౌరులకు భవిష్యత్తు ప్రదాత ఆర్ఎస్పి నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సేవలను భవన నిర్మాణ కార్మికులు ఆ సారు ఉండగా మా పిల్లలకు మంచి చదువు అందింది అని ఎంతో ఉప్పొంగిపోయారు. ఆర్ ఎస్ పి అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని, లక్ష్యాన్ని విద్యార్థులకు నేర్పి వారి భవిష్యత్తుకు బాటలు వేశారనీ గుర్తు చేశారు.






