
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వర చారి మృతికి ప్రజాస్వామిక బిసి ఉద్యమ వేదిక, బీసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎంతోకాలంగా బీసీలు రాజకీయ ఆర్థిక సామాజిక రంగంలో వెనుకబడిపోయారని అగ్రవర్ణాల మూసానికి బలైపోయారని అన్నారు. చైతన్యవంతులైన బీసీలు తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారని ఇందులో భాగంగా 42% రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరచారి మరణాన్ని బీసీలు, బహుజనులు మరిచిపోరని చెప్పారు. మరొక బీసీ బిడ్డ మృతి చెందక ముందే పాలకులు కళ్ళు తెరవాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర చారి మృతి వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు న్యాయవాది ముక్కెర రాజు, ప్రజాస్వామిక బీసీ ఉద్యమ వేదిక కన్వీనర్ రవీందర్, భీమోజు సదానందం, బీసీ నాయకులు పులి జగన్నాథం, కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, ఆలేటి రవీందర్, వేల్పుల రత్నం, బీఎస్పీ నాయకులు పల్లె ప్రశాంత్ గౌడ్, ఎర్రబోజు నారాయణ, చిలకమారి శ్రీనివాస్, కాసనగొట్టు కిరణ్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సాయి ఈశ్వరచారి మృతికి నివాళులర్పిస్తున్న పలువురు ప్రజా సంఘాల నాయకులు…





