
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ తహసీల్దారుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జక్కని నరేందర్ ని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ జక్కని నరేందర్ హుజూరాబాద్ తాసిల్దారుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ తహసిల్దార్ గా తమ విధులను సమాజంలోని అన్ని వర్గాల ఆధారాభిమానాన్ని చూ రగోనె విధంగా నిర్వర్తించాలని అభిలాషించారు. అదేవిధంగా తాను ఆదర్శవంతంగా ఉంటూ సమాజానికి ఆదర్శమైన అధికారిగా సేవలందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ అధికారిగా పేరుగాంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సందేల వెంకన్న, చిలుకమారి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఆకుల సదానందం, ఇప్పకాయల సాగర్, బండారి సదానందం, న్యాయవాది కామణి సమ్మయ్య, తాటిపాముల కనకయ్య, చీకట్ల సమ్మయ్య, నడిగోటి రమేష్, పంజాల వెంకటేశ్వర్లు, రామ్ సారయ్య, మాడుగుల ఓదెలు, గాజర్ల బుచ్చిరాజం, పరాంకుశం సనత్ కుమార్, పెద్దపేట రమేష్, మామునూరి ప్రవీణ్ కుమార్, తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, అశోక్, పి రాజమౌళి, మొలుగు సతీష్, డి నానాజీ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దారుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జక్కని నరేందర్ ని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ తదితరులు.

కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు…





