Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఓడితేల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు హుజురాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టౌన్ అధ్యక్షులు మేకల తిరుపతి మరియు హనుమాన్ దేవస్థానము ఛైర్మెన్ కొలిపాక శంకర్, మహిళ టౌన్ ప్రెసిడెంట్ పుష్పలత, మండల మహిళ అధ్యక్షురాలు పీ రాధ, మార్కెట్ డైరెక్టర్ లు, మైనార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ త్యాగానికి గొప్ప నిర్వచనమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన ప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకురాలని కొనియాడారు.

పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి, ఇతర విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు..





