
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సారధి కేసీఆర్ 2009లో చేసిన దీక్ష తోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన ఇచ్చిన రోజు విజయ దివస్ అని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…డిసెంబర్ 9,2009 రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాట చరిత్రలో మరుపురాని చారిత్రాత్మకమైన రోజని అన్నారు. కెసిఆర్ చేసిన దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రకటన చేసిన రోజని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీరిన రోజు కాబట్టి దీనిని విజయ దివస్ గా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రత్యేకమైన రోజును నేటి తరానికి తెలియజేయాలని, కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం చూపిన పోరాట పటిమ వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు అనేక మోసాలకు గురయ్యారని ఆరోపించారు. అమలుకు నోచుకోని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు మరిచి ప్రజా పాలన నయవంచన పాలనగా మారిందని అన్నారు. కెసిఆర్ చూపిన మార్గంలో గులాబీ సైన్యం నడుస్తుందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు కల్లేపల్లి రమాదేవి, కుమారస్వామి, నాయకులు చందా గాంధీ, ఆర్కే రమేష్, ఇమ్రాన్, పంజల శ్రీధర్, కే రోషేoదర్, వి రాజు, బి సమ్మయ్య, టి లక్ష్మణమూర్తి, దిల్ శ్రీనివాస్, ఏం తిరుపతి, వి విక్కి, బి వెంకటేశ్వర్లు, బోల్ల రమేష్, కే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..

తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు..





